ఏపీలో విపక్షాలు మూడురాజధానుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు . ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని అమ్మవారి శాలలో విజయదశమి సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు దుర్గమ్మ అవతారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మూడు రాజధానులకు అనుకూలంగా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి ప్రతిపక్షాలకు సద్బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారికిఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు 101 టెంకాయలు కొట్టారు.
Read Also: K Laxman: టీఆర్ఎస్‌కు నూకలు చెల్లాయ్.. అందుకే బీఆర్ఎస్‌తో కొత్త డ్రామా
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజయదశమి రోజున అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ అలానే సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికై మూడు రాజధానులు ప్రకటించారని దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు. ఆయన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నామని ప్రతిపక్షాలు అనవసరంగా మూడు రాజధానుల విషయాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డం పడుతున్న ప్రతిపక్ష పార్టీలకు సద్భుద్దిని దుర్గమ్మ ప్రసాదించాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు తెలిపారు.
Read Also: Mukesh Ambani: ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు.. పేల్చేస్తామని హెచ్చరిక