MLA Anil Kumar Yadav Challengers Anam Ramanarayana Reddy: నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తాజాగా ఆనం రామనారాయణరెడ్డికి సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో దమ్ముంటే నెల్లూరు సిటీ నుంచి తనతో పోటీ చేయాలన్నారు. ఒకవేళ తాను ఎన్నికల్లో ఓడిపోతే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆనం.. కనీసం రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తనని రాజీనామా చేసి పోటీకి సిద్ధమా అని ఆనం ప్రశ్నించారని.. ఇప్పుడు రాజీనామా చేసినా, జనవరిలోనే ఎన్నికలు వస్తాయని అన్నారు.
Yuvraj Singh: ధోనీని ఎంతో నమ్మాను.. కానీ కోహ్లీ మాత్రమే సపోర్ట్ ఇచ్చాడు..
జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా, తనకు గెలిచే సత్తా ఉందని ఆనం చెబుతున్నారని.. తనని బచ్చాగాడు అని కామెంట్ చేశారని.. తాను కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొన్నారు. బచ్చా అంటున్న తనతోనే పోటీ చేయాలని డిమాండ్ చేశారు. టికెట్ తెచ్చుకునే సత్తా ఉంటే.. వచ్చి తనతో పోటీ చేయాలన్నారు. నెల్లూరు నుంచి పోటీ చేయాలనే కోరిక ఉందని ఆనం చెప్పారని.. ఎక్కడి నుంచి ఆయన రాజకీయం ప్రారంభించాడో, అక్కడే ఆయన రాజకీయాన్ని ముగించేస్తానని ఛాలెంజ్ చేశారు. గత ఎన్నికల్లో జగన్ భిక్ష వల్లే ఎమ్మెల్యే అయిన ఆనం.. ఇప్పుడు ఆయననే తిడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన నేతలు, ఒకసారి కూడా గెలవని టీడీపీ నేత ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారని వ్యాఖ్యానించారు. పప్పు, పులకేసి అని ప్రజలు పిలిచే ఆ నేత స్థాయి కంటే.. తన స్థాయే పెద్దదన్నారు.
Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
అంతకుముందు.. ఇకపై అనిల్ ఆట ఏంటో చూపిస్తానంటూ ప్రత్యర్థులకు అనిల్ కుమార్ సవాల్ విసిరారు. పిల్లాడిగా ఉన్నప్పుడే ఓ పెద్ద కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేశానని, ఇకపై అనిల్ సత్తా ఏంటో చూపిస్తానని ఆగ్రహంతో ఊగిపోయారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఎవరెన్ని కుట్రలు చేసినా తనను జగన్‌కు దూరం చేయలేనని తేల్చి చెప్పారు. తన గుండె కోస్తే, అందులోనూ జగన్ బ్లడ్ ఉంటుందన్నారు. జగన్‌కు తాను మిలిటెంట్ స్క్వాడ్ లాంటోడినని, తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు.