NTV Telugu Site icon

Jagan Davos Tour: ఏపీలో రూ.5,600 కోట్ల పెట్టుబడులపై మిట్టల్ ప్రకటన

Jagan Davos Tour

Jagan Davos Tour

ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్‌లో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో ఆర్సెల‌ర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ సమావేశమైన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు విశాఖ‌లోని త‌న ప్లాంట్ విస్తర‌ణ నిమిత్తం రూ.1,000 కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు ఆదిత్య మిట్టల్ అంగీకరించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఇటీవల గ్రీన్ కో నేతృత్వంలో ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరినట్లు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో తమ వాటా కింద రూ.4,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించింది.

Pawan Kalyan on Davos: దావోస్ లో జగన్ చెబుతున్నవి నిజాలేనా?

కాగా మరోవైపు ఏపీలో విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారీ పెట్టుబడులు పెట్టేలా అదానీ గ్రీన్‌ ఎనర్జీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంసలు కురిపించారు. దావోస్‌ సదస్సులో గతంలో ఎన్నడూ జరగని విధంగా సీఎం జగన్‌ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర విద్యుత్‌ రంగంలోనే కీలకమైన పరిణామం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.

Show comments