Peddireddy Ramachandra Reddy : ఏపీలో వైఎస్సార్‌సీపీ నేతల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న తన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి మాట్లాడుతూ .. “మిథున్ రెడ్డికి కోర్టు ఆదేశాల ప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా సరైన విధంగా అమలు కావడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే విషయానికి నిదర్శనం.
Nimmala Ramanaidu : అంబటి చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయి
గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలుస్తోంది” అని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఇలాంటి వ్యవహారం ఎప్పుడూ చేయలేదని గుర్తు చేశారు. “మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత బలంగా, సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేస్తారని నమ్మకం ఉంది” అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
Kurnool : తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
