Site icon NTV Telugu

misbehaviour with students: నిట్‌లో కీచకపర్వం..! విద్యార్థినులతో వెకిలిచేష్టలు..

Misbehaviour

Misbehaviour

విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కలవారితో ఆడపిల్లలకు రక్షణ అనుమానంగా మారిపోయింది.. ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఎక్క ఏ కామాంధుడు ఉన్నాడో తెలియని పరిస్థితి.. తీరా చదువుకునే ప్రాంతంలోనూ వేధింపులు తప్పడంలేదు.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌లో కీచకపర్వం వెలుగుచూసింది. బయోటెక్నాలజీ లెక్చరర్‌ తమిళమణి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని… విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజీ అడ్మినిస్ట్రేషన్‌ భవనం దగ్గర ధర్నా చేశారు. లెక్చరర్‌ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. దీంతో క్యాంపస్‌లో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read Also: Elon Musk: ట్విట్టర్‌లో కీలక పరిణామాలు.. ఎలాన్‌ మాస్క్‌ ఎంట్రీ తర్వాత..

పోలీసులు అక్కడి వెళ్లి… విద్యార్థులకు నచ్చజెప్పారు. నిట్‌ అధికారులతోనూ మాట్లాడారు. లెక్చరర్‌ తమిళమణిని తొలగించామని చెప్పడంతో… విద్యార్థులు శాంతించారు. మొత్తంగా ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో తరగతులను బహిష్కరించి విద్యార్థులు ధర్నా చేపట్టడంతో నిట్ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇది ఎలా ఉండగా నిట్ ప్రాంగణంలోనికి ఎవరిని వెళ్లనీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో మరింత ఘర్షణ వాతావరణం నెలకొంది.

Exit mobile version