NTV Telugu Site icon

Harassment : అనకాపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం..

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. చట్టాలు చేసినా.. కామాంధులు మాత్రం మారడం లేదు.. అన్య పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుండగుడు.. అనకాపల్లి జిల్లాలో రాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెలు బహిర్భూమికి వెళ్లారు. దీంతో.. బయటకు వచ్చిన సమయంలో బాలికను లాక్కెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని తల్లిదండ్రులకు బాలిక వచ్చి చెప్పింది.

దీంతో హుటాహుటినా తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలలో చిన్నారి జాడ కోసం వెతికారు. దీంతో రక్తస్రావంతో అపస్మారకస్థితిలో తల్లిదండ్రులకు బాలిక కనపడింది. వెంటనే బాలికను ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే.. పక్కింట్లో ఉంటున్న సాయి అత్యాచారం చేశారంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.