కృష్ణాజిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..బుధవారం సీఎం జగన్ చేతుల మీదుగా పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే ఇది విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా జగనన్న పాలవెల్లువ ప్రారంభిచడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. నూజివీడు డివిజన్ పరిధిలో 9 మండలాలను గుర్తించామన్నారు.
3,800 మంది రైతులు పాలను అందించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ట్రయల్ రన్‌లో భాగంగా రోజుకు 7500 లీటర్ల పాల సేకరణ జరుగుతందున్నారు. కృష్ణాజిల్లాలో మరో 26 మండలాలను గుర్తించామన్నారు. 2022 సంవత్సరాంతానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పాలవెల్లువ కార్యక్రామాన్ని ప్రారంభించడానికి కసరత్తులు చేస్తున్నామన్నారు. మహిళా సాధికారితే లక్ష్యంగా ఈ జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వారి ఆర్థిక స్వాలంబనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సహకార డెయిరీలు ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ర్టంలో లేవని మంత్రి తెలిపారు.
