Site icon NTV Telugu

Vidadala Rajini: అసెంబ్లీలో మంత్రి విడదల రజినీ టంగ్ స్లిప్.. ఏమన్నారంటే..?

Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రసంగించారు. వైఎస్ఆర్ గురించి చెప్తూ ఆమె టంగ్ స్లిప్ అయ్యారు. వైఎస్ఆర్ అంటేనే తెలుగు ప్రజలకు ఆత్మీయత అని.. ఒక మానసిక భావన అని వెల్లడించారు. ఒక మనిషి శాసిస్తే గాడితప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుంది అనడానికి బదులు ‘పట్టలేకపోతుంది’ అంటూ మంత్రి విడదల రజినీ మాట్లాడారు. తడబడిన తర్వాత మరోసారి ఆ పదాన్ని సవరించుకున్నారు. ఒక మనిషి మరణిస్తే ఆ వార్తను తట్టుకోలేక వందలాది మంది మరణిస్తారంటే అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ అని వ్యాఖ్యానించారు.

Read Also:Love Story: ట్రాఫిక్ జామ్‌లో ప్రేమకథ.. అలా మొదలైంది..!!

కాగా మంత్రి విడదల రజినీ టంగ్ స్లిప్ కావడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ ఆమె ఓ సందర్భంలో తడబడ్డారు. ఎక్సైజ్ పాలసీ, గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. గాంధీజీ 150వ జయంతి అంశాన్ని ప్రస్తావించారు. అయితే పొరపాటున గాంధీజీ జన్మించి 70 ఏళ్లు అయ్యిందన్నారు. 150వ జయంతి అని చెప్పిన ఆమె.. వెంటనే 70 ఏళ్లు అనేయడంతో తేడా వచ్చేసింది. అదేంటి 150వ జయంతిని పట్టుకొని 70 ఏళ్లు అంటారా అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో నెటిజన్‌లు మంత్రి విడదల రజినీ వీడియోను ట్రోల్ చేశారు.

 

Exit mobile version