Minister Venugopala Krishna Demands Sorry From Pawan Kalyan: ఏపీ వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యాలపై వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పవన్ వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏలూరు వారాహియాత్ర సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. రాష్ట్రంలో మహిళలను, మహిళా వాలంటీర్లను అవమానించాడని ఆరోపించారు. మహిళలకు పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందని అన్నారు. వాలంటీర్లను జనం తమ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారని, పవన్ కళ్యాణ్‌ను జనం క్షమించరని తేల్చి చెప్పారు. పవన్ కచ్ఛితంగా జనాగ్రహానికి గురికావాల్సిందేనని ఫైర్ అయ్యారు.
MLA Prasanna Kumar: పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు చేయడం సరికాదు
ఇదే సమయంలో ఉభయగోదావరి జిల్లాల వైసీపీ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా పవన్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హాయంలోనే మహిళల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని ఆరోపించారు. కానీ.. తమ వైసీపీ హయాంలో మిస్సింగ్ కేసులు గణనీయంగా తగ్గాయని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వస్తే.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని పవన్ ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నేతృత్వంలో పవన్ పని చేస్తున్నారని అన్నారు. అసలు ఉభయగోదావరి జిల్లాలో మీ అభ్యర్థులు ఎవరో చెప్పగలరా? అని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన 34 సీట్లలో పోటీ చేయనున్నట్టు వార్తలొస్తున్నాయని.. అసలు ఆ సీట్లలో ఎన్నింటిలో పోటీ చేస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో వర్గపోరు ఉందన్న ప్రచారమూ అవాస్తవమేనని, పార్టీ పటిష్టంగానే ఉందని క్లారిటీ ఇచ్చారు.
Mithun Reddy: పవన్‌కి మిథున్ రెడ్డి సవాల్.. ఆ ప్రకటన చేసే దమ్ముందా?