Site icon NTV Telugu

Taneti Vanitha: ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సాగునీరు విడుదల చేస్తాం

Taneti Vanitha

Taneti Vanitha

ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, అగ్రికల్చర్‌పై రివ్యూ మీటింగ్ నిర్వహించగా ఈ సమావేశానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇదే మొదటి సమావేశమని తెలిపారు. ఈ మీటింగ్‌లో వచ్చిన సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాను ముందుండి నడిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పాత కృష్ణా జిల్లాకు మంచి పేరు ఉందని.. ఇప్పుడు అదే రీతిలో ఎన్టీఆర్ జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు.

Chandra Babu: నేను కన్నెర్ర చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరు

మరోవైపు ఈ ఏడాది రైతులకు ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే ప్రభుత్వం నీరు అందించబోతుందని మంత్రి తానేటి వనిత ప్రకటించారు. గత మూడు సంవత్సరాల కాలంలో వర్షాలు బాగా పడ్డాయని.. రైతులకు వ్యవసాయం సులభతరం అయిందని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుతో రైతులకు సాయం అందుతుందన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ నెల 26న శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర ప్రారంభిస్తున్నామని.. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని మంత్రి తానేటి వనిత వెల్లడించారు.

Exit mobile version