Minister Seediri Appalaraju Says YS Jagan Again Win As AP CM: ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు బుర్రలో ఏమీ లేదని.. బాబు విజనరీ కాదు, విస్తరాకుల కుట్ట అని విమర్శించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి గత నాలుగేళ్లలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమం అందిస్తున్నామన్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు చెప్పిన మాటలకు గాను ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సోమరపోతుల్ని చేస్తుంది, అప్పులాంధ్ర, రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తోందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
Venkatesh: నంది అవార్డులపై వెంకటేశ్ కామెంట్స్.. ఇస్తే ఇవ్వొచ్చు, లేదంటే లేదు
చంద్రబాబుకి సిగ్గు, లజ్జ ఉంటే.. క్షమాపణ చెప్పిన తరువాత మేనిఫెస్టో గురించి మాట్లాడాలని మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. మినీ మహానాడులో ప్రవేశపెట్టిన మొదటి ఆరు హామీలకు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలుసా? అని ప్రశ్నించారు. ప్రస్తుత కమ్యునికేషన్ యుగంలో చంద్రబాబు చేసిన వికృత చేష్టలు, నికృష్టపు మాటలు ప్రజలు మర్చిపోరని పేర్కొన్నారు. ప్రభుత్వం అమ్మ ఒడి, చేయూత, ఇళ్లు ఇచ్చే సందర్భాల్లో.. చంద్రబాబు దిగజారి మాట్లాడారని మండిపడ్డారు. సంక్షేమం ద్వారా నాణ్యమైన వనరులు సాధించేందుకు కృషి చేస్తున్నారన్నారు. జగన్ మోహాన్ రెడ్డి శకం ఏపీకి ఓ స్వర్ణయుగమని అభివర్ణించారు. పోర్ట్‌లు, హార్బర్‌లు, నాడు-నేడు ప్రోగ్రామ్‌లు, రోడ్లు వంటి అభివృద్ది కార్యక్రమాలు వచ్చే ఏడాదిలోగా చేస్తామని మాటిచ్చారు. జగన్ మరోసారి అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
Bihar: బీహార్లో దారుణం.. పోలీస్ ఇంట్లోనే వ్యభిచారం
అంతకుముందు మాజీ ఎంపీ దివంగత బొడ్డేపల్లి రాజగోపాల్ రావు శతజయంతి వేడుకల్లో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్ర భారత దేశంలో కాంగ్రెస్‌ను ఢీకొని, స్వతంత్ర ఎంపీగా బొడ్డేపల్లి గెలుపొందారన్నారు. ఆరు సార్లు ఎంపిగా శ్రీకాకుళం జిల్లా అభివృద్దికి కృషి చేశారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు లైఫ్‌లైన్ ప్రోజెక్ట్ వంశధారను తీసుకొచ్చారన్నారు. సిక్కోలు చరిత్ర ఉన్నంతవరకూ బొడ్డేపల్లి చరిత్ర ఉంటుందన్నారు. ఇండస్ర్టియల్ పార్క్, ఆమదాలవలస షుగర్ ప్యాక్టరీ స్దాపించారని చెప్పారు. రాజకీయాలతో, వర్గాలతో, కక్షలతో సీఎం జగన్‌కి పనిలేదన్నారు. వంశధార ప్రాజెక్ట్ ఒడిస్సా ఇష్యూ కారణంగా ఆలష్యం అవుతోందని వివరించారు.