NTV Telugu Site icon

Minister Seediri Appalaraju: లోకేష్ పాదయాత్రకు లక్ష్యం లేదు.. అది ఆయన తరం కాదు..

Minister Seediri Appalaraju

Minister Seediri Appalaraju

Minister Seediri Appalaraju: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర ఎన్ని అపశృతులతో మొదలైందో చూశాం అన్నారు.. మన ఆలోచన సక్రమంగా లేకపోతే మన ప్రయత్నం వృథా అవుతందని నమ్మకం.. లోకేష్ పాదయాత్ర చూస్తే అది నిజమనిపిస్తోందని విమర్శించారు. లోకేష్ పాదయాత్రకు ఓ లక్ష్యం లేదు అని ఆరోపించిన ఆయన.. అసలు ఏ లక్ష్యం కోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అప్పట్లో రాష్ట్రంలో అప్రజాస్వామ్యక విధానాలు ఉండటంతో.. రాజ్యాంగ విరుద్ద పరిపాలనపై జగన్ పాదయాత్ర చేశారని తెలిపారు.. ఇక, ఎమ్మెల్యేలను సంవత్సరం పాటు సస్పెండ్‌ చేశారు.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు మైక్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

Read Also: Avinash Reddy: వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి

మరోవైపు.. ఓటుకు నోటులో దోరికిపోయి ఇక్కడికి వచ్చి కులం కోసం రాజధాని కట్టుకుంటూ ప్రజలను మోసం చేశారని చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు మంత్రి అప్పలరాజు.. చంద్రబాబుకు వయస్సు మీరింది.. గతంలో ఏం మాట్లాడారో కూడా మర్చిపోతున్నారని విమర్శించారు. రేపు పార్టీకి దిక్కేవరు అనే ప్రయత్నాల్లో భాగంగా.. ఎన్నికల్లో గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నారని.. లోకేష్ అవగాహణ లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.. శ్రీసిటి మేమో కట్టామంటారు.. రేపు అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ కూడా మేమే పెట్టాం అనేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.. అసలు చంద్రబాబు హయాంలో గుర్తుండే ఒక్క పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు..

Read Also: Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు..

సీఎం వైఎస్‌ జగన్‌కు పక్కకు తోసేయడం ఎవరి తరం కాదనే నకమ్మకాన్ని వ్యక్తం చేసిన మంత్రి అప్పలరాజు.. లోకేష్ తరం అస్సలు కాదన్నారు.. అసలు, లోకేష్‌తో పోలీక తీసుకురావడం వల్ల వైఎస్‌ జగన్ స్థాయి తగ్గిపోతుందన్నారు.. అచ్చెన్నాయుడు సిక్కోలు వాసి అయిఉండి.. అలా మాట్లాడటం నాకు బాధకలిగించిందన్న ఆయన.. పోలీసులు సరిగ్గా గమనిస్తే అచ్చెన్నాయుడు పిర్రలు పగలగొట్టొచ్చని అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు.. రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడును ప్రజలే మట్టి కరిపిస్తారని హెచ్చరించారు.. ఇక, భారత దేశ చరిత్రలో ..అరసవల్లి సూర్యనారాయణ స్వామి ప్రాముఖ్యం చెందినవారు.. దేవదేవుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి.. ప్రభుత్వాన్ని ఇరుకు పెట్టేందుకు కోన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి..
వాటన్నింటి నుండి రక్షణ కల్పించాలని సూర్యదేవున్ని కోరుకున్నానని తెలిపారు మంత్రి అప్పలరాజు.