Site icon NTV Telugu

Aqua Farming: ఆక్వా రంగం.. ప్రపంచ దేశాలకు హబ్‌గా ఏపీ..

Seediri Appalaraju

Seediri Appalaraju

Aqua Farming: ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రపంచ దేశాలకు హబ్‌గా మారిందని తెలిపారు మంత్రి సీదిరి అప్పలరాజు.. విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. డయిరీ రంగంలో డిజిటలైజేషన్ సమూల మార్పుకి దోహద పడిందన్నారు.. పశువుల సంతానోత్పత్తిలో డిజిటల్ హెల్త్ కేర్ ఉపయోగ పడుతోందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో మొదటి స్థానంలో ఉందని సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పశువుల సంతానోత్పత్తిలో ఏపీ రికార్డ్ స్థాయిలో టెక్నాలజీ పరంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. మిషన్ పుంగనూరు పేరిట పాల సేకరణలో లాభాలార్జన జరగుతోందని.. 2000 బల్క్ కూలింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. గుజరాత్ మిల్క్ సొసైటీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపిన ఆయన.. ఆక్వా కల్చర్ అభివృద్ధిలో ఏపీ టెక్నాలజీ పరంగా ముందుందన్నారు.. అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ దేశాలకు ఆంధ్ర రొయ్య పిల్లలు ఎగుమతులు చేస్తూ రికార్డ్ సృష్టించిందని.. ఆక్వా రంగంలో ఏపీ ప్రపంచ దేశాలకు హబ్‌గా మారిందని తెలిపారు మంత్రి సీదిరి అప్పలరాజు.

Read Also: Ambati Rambabu: ప్రాజెక్ట్‌ల పైనే కాదు, నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు..

ఇక, విశాఖపట్నం రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. విశాఖ ఇకపై అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్‌ అని పేర్కొన్నారు మంత్రి.. కాగా, విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గడం లేదు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యమని.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటున్నారు.. కర్నూల్‌ను న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా మారుస్తామని.. విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నమాట.

Exit mobile version