
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి శంకర నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చోని జూమ్‌లో మాట్లాడుతున్నారని, కరోనా భయంతో బయటకు రాకుండా ఉన్నారని అన్నారు. 14 సంవత్సరాల్లో ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బాబు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యాక్సినేషన్ కోసం చర్యలు తీసుకుంటోందని, చంద్రబాబు వ్యాక్సిన్ గురించి మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని విమర్శంచారు. అధికారులలో మనోస్థైర్యం నింపాలికానీ, అసత్య ఆరోపణలు చేయడం తగదని, పార్టీ పరంగా కూడా కోవిడ్ బాధితులకు సహాయం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆక్సీజన్ నిల్వలు అవసరం మేరకు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని, ప్రస్తుతం డాక్టర్ల కొరత కూడా లేదని మంత్రి శంకర నారాయణ పేర్కోన్నారు.