NTV Telugu Site icon

Minister Roja: నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది?

Roja Counter To Nagababu

Roja Counter To Nagababu

Minister Roja Strong Counter To Nagababu: మెగాబ్రదర్ నాగబాబుకి ఏపీ మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విషయం ఉంటేనే విమర్శ చేయాలి గానీ, నోటికి ఎంతొస్తే అంత బాగడం సబబు కాదన్నారు. ఏమీ తెలియకుండా తన శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం, ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రీసెంట్‌గా నాగబాబు ఓ వీడియోలో మాట్లాడుతూ.. తన సోదరులైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని.. పర్యటనలు మానేసి, పర్యాటక శాఖ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని, రోజా పదవి నుంచి దిగిపోయేలాగా 20వ స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకు కౌంటర్‌గానే రోజా ఫేస్‌బుక్ మాధ్యమంగా స్పందించారు.

Sankranti War: బాలకృష్ణ- చిరంజీవి జోడీ సంక్రాంతి విశేషాలు

‘‘ఏదైనా విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలి.. అంతేగానీ నోటికి ఎంత వస్తే అంత వాగడం, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం సబబు కాదు. ఏమీ తెలియకుండా నా శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం.. వాళ్ల అవగాహనారాహిత్యానికి నిదర్శనం. నేను పర్యాటక శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక.. దేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం మూడో స్థానంలో ఉంది. ఇదేమీ తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. నేను ఏనాడు చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పర్యాటకంగా ఏపీకి ఏం చేశారని రాజకీయంగా మాట్లాడలేదు. మాట్లాడను కూడా. ఎందుకంటే.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి. గతంలో మీరూ మీరూ (టీడీపీ-జనసేన) మాట్లాడుకున్న మాటల్నే గుర్తు చేస్తే.. ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు గతంలో వాళ్లేం మాట్లాడుకున్నారో చూపించి.. సదరు వ్యక్తికి ఈ వీడియో చేరేలా ఉండాలని షేర్ చేస్తున్నా’’ అంటూ బాలయ్య, పవన్ కళ్యాణ్‌లు పరస్పరం చేసుకున్న వ్యాఖ్యల వీడియోని షేర్ చేశారు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్యకి పోలీసులు షాక్.. ఎక్కడైనా వాలిపోతామంటున్న మెగాఫ్యాన్స్

తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద శత్రుత్వం లేదని.. పార్టీ పరంగా, సిద్ధాంతపరంగా మాత్రమే తన వ్యాఖ్యలు ఉంటాయని అర్థం చేసుకోవాలని రోజా కోరారు. తనని అంత మాట అన్నందుకు తాను కూడా తిరిగి ఓ మాట అనొచ్చని, అయితే తనకు సంస్కారం అడ్డొచ్చిందని పేర్కొన్నారు. ఆనాడు మీ పార్టీ వాళ్లను స*కజాతి, అలగా జనం అని అంత హీనంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుందో పైవాడికే తెలియాలని చెప్పారు. ఓడిపోయిన మీరే అన్ని మాటలంటే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానెంత అనాలని నిలదీశారు. రాజకీయ విమర్శలు తప్పా, వ్యక్తిగత విమర్శలు చేయడం తనకిష్టం లేక మిమ్మల్ని ఆ మాట అనలేక వదిలేస్తున్నానని.. ముందు మహిళను ఎలా గౌరవించాలో తెలుసుకోండని రోజా సూచించారు.