NTV Telugu Site icon

Roja Selvamani: ఎడ్లబండిని తోలిన మంత్రి రోజా.. ఫోటోలు వైరల్

Minister Roja

Minister Roja

Roja Selvamani: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం తూర్పు గోదావ‌రి జిల్లా త‌ణుకులో జ‌రిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బ‌ల ప్రద‌ర్శన కార్యక్రమానికి మంత్రి రోజా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఎడ్లబండిని తోలుతూ ఉత్సాహంగా కనిపించారు. ఆమె ఎడ్లబండిని తోలిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు బావితరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిర్వహించడం చాలా అభినందనీయమని మంత్రి రోజా కొనియాడారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆమె విమర్శలు చేశారు.

Read Also: Chintamaneni Prabhakar: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై చింతమనేని సంచలన వ్యాఖ్యలు

నరకాసురుడిని సంహరించినందుకు దసరా శరన్నవరాత్రులు జరుపు కుంటామని.. మూడేళ్ల క్రితం జగనన్న మన రాష్ట్రంలో నారాసురిడిని సీఎం జగన్ సంహరించారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కుప్పం వెళ్తే లోకేష్ కలుగులో ఎలుకలా దాక్కున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు లాంటి సైకోలను జనం రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రోజా అన్నారు. అటు రాష్ట్రానికి మూడు రాజధానులకు మద్దతుగా ప్రజలందరూ విజయదశమి రోజు ఆలయాలకు వెళ్లి పూజలు చేయాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతటా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ యోచిస్తుంటే.. తన బినామీలను కాపాడుకోవడానికే 29 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.