NTV Telugu Site icon

Minister RK Roja: లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ సైకో.. తమ పరిస్థితి ఏంటి అని జనం వణికిపోతున్నారు..!

Rk Roja

Rk Roja

Minister RK Roja: నారా లోకేష్‌ పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు సైకో అయితే.. నారా లోకేష్ ఐరన్ లెగ్ సైకో అంటూ విరుచుకుపడ్డారు.. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు.. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే.. వాళ్ల నాన్న చంద్రబాబుకి ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయి.. మొన్న పాదయాత్ర పోస్టర్ లాంచింగ్ చేస్తే 8 మంది చనిపోయారు.. నిన్న పాదయాత్ర చేస్తే నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చిదంటూ వ్యాఖ్యానించారు.. ఇక, లోకేష్ లాంటి ఐరన్ లెగ్ రాష్ట్రం అంతా నడిస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు భయపడిపోతున్నారని చెప్పుకొచ్చారు మంత్రి రోజా.

Read Also: YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా కేసులో విచారణ ముమ్మరం.. ఆ ఐదుగురికి సీబీఐ కోర్టు నోటీసులు

మరోవైపు లోకేష్‌ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు మంత్రి రోజా.. లోకేష్ పాండిత్యాన్ని చూసి ఆయన పులకేసి అనాలని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారని… రోడ్డు మీదకు వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో కొంతమంది అని మండిపడ్డారు.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వైఎస్‌ జగన్‌.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు.. తారకరత్నకు గుండెపోటు వస్తే పట్టించుకోలేదని ఆరోపించిన ఆమె.. సీఎం వైఎస్‌ జగన్‌పై మాట్లాడే అర్హత ఏ కోణంలో చూసినా లోకేష్‌ కు లేదన్నారు.. తన తండ్రిని అభిమానించే వాళ్ల కష్టాలు వినేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్.. వారి సమస్యలను తెలుసుకుని, తీర్చారని తెలిపారు.. దొంగదారిలో తన తండ్రి కేబినెట్‌లో మంత్రి అయిన లోకేష్‌…
వాళ్ల నాన్నకు సంబంధంలేనివి కూడా ఆయనే నిర్మించారని చెబుతారంటూ ఫైర్‌ అయ్యారు..

Show comments