Site icon NTV Telugu

Minister RK Roja: లోకేష్ పాదయాత్ర జోకేష్‌ యాత్రలా మారింది.. జబర్దస్త్‌తో పోటీ పడుతోంది..!

Minister Rk Roja

Minister Rk Roja

Minister RK Roja: నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. లోకేష్ పాదయాత్ర కాస్త రోజు రోజుకి జోకేష్‌ పాదయాత్రలా సాగుతూ జబర్దస్త్ కి పోటీగా నిలబడుతోంది అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబుకు చివరి అవకాశం ఇస్తే ఆంధ్ర ప్రజలకు ఇదే చివరి రోజులు అవుతాయంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. ఒక పక్క వయోవృదుడు.. మరో పక్క అసమర్థుడితో తెలుగు దేశం పార్టీ నలిగి పోతోంది అంటూ చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు గుప్పించారు. ఇక, కర్ణాటకలో ఉన్న డ్యాంల ఎత్తును పెంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా.

Read Also: Popcorn Movie Review: పాప్ కార్న్ రివ్యూ

అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు శాశ్వత కట్టడాలు నిర్మించలేదు? అని నిలదీశారు మంత్రి రోజా.. రాష్ట్రాన్ని విడగొట్టి అప్పులపాలు చేసిన ఘనత చంద్రాబాబుదేనన్న ఆమె.. పరిపాలన వికేంద్రకరణ వల్ల వెనక బడ్డ రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.. ఇక, రాయలసీమకు న్యాయ రాజధాని రావడం రాయలసీమ బిడ్డగా తనకెంతో గర్వకారణంగా ఉందని వెల్లడించారు.. మరోవైపు.. విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కల్యాణ్‌ వచ్చి మంత్రుల కార్లని పగలకొట్టి పక్క దారి పట్టించాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాగా, లోకేష్‌ పాదయాత్ర నేపథ్యంలో.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అసలు లోకేష్‌ పాదయాత్రకు ప్రజలు రావడం లేదని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తూనే.. లోకేష్‌ ఎంత ఎక్కువ కాలం పాదయాత్ర చేస్తే.. అంత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే మేలు జరుగుతుందని మంత్రులు వ్యాఖ్యానిస్తోన్న విషయం విదితమే.

Exit mobile version