NTV Telugu Site icon

Minister Roja: ప్రజాగర్జనను పక్కదోవ పట్టించేందుకు పవన్ పర్యటన

Rk Roja (1)

Rk Roja (1)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా (minister Roja) ఏపీ రాజకీయాలపై స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ఏర్పాటు చెయ్యాలని జగన్ నిర్ణయించారన్నారు. రాయలసీమ బిడ్డగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నా అన్నారు రోజా. బినామీల పేర్ల పైన వున్న ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు అమరావతిని రాజధాని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు అమరావతి ఉద్యమాని చేయిస్తున్నాడు. దొంగ రైతులతో ఉద్యమాని నడుపుతూ ఉత్తరాంధ్రలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.

Read Also: Gold Seized: ఎయిర్‌పోర్టులో 41 కిలోల బంగారం పట్టివేత.. 100 కేజీల వెండి స్వాధీనం

పార్టీలకతీతంగా చేపడుతున్న ఉత్తరాంధ్ర గర్జనకు మద్దతు ఇస్తున్నా అన్నారు మంత్రి రోజా. ప్రజాగర్జనను పక్క దోవ పట్టించేందుకే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వెళుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ,బామ్మరదులు అన్ స్టోప్పబుల్ గా ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్టీఆర్ ను అవమానించి…మరణానికి కారణం అయ్యిన బాబు…ఈ రోజు తన ఆరాధ్యదైవం అనడం సిగ్గుచేటు అన్నారు. ఉతరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ప్రజలు తరిమి కొడతారన్నారు మంత్రి రోజా.

Read Also: Uber driver: బిడ్డ చదువు కోసం తండ్రి చదువుతున్నాడు.. ఉబెర్‌ ఆటోడ్రైవర్ స్టోరీ