Site icon NTV Telugu

Rk Roja: నువ్వు ఎవడ్రా పవన్ కల్యాణ్.. జగన్ ఎన్ని ఇళ్ళు కట్టుకోవాలో చెప్పటానికి..

Roja

Roja

పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను సీఎం జగన్ ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారు అని మంత్రి రోజా ఆరోపించారు. వైజాగ్ ను క్రైం సీటిగా పవన్, చంద్రబాబు చిత్రీకరిస్తున్నారు.. రిషికోండకు బోడిగుండు కోట్టించారంటూ బోడి యదవలందరూ బోడి ప్రచారం చేస్తున్నారు అని ఆమె విమర్శించారు.
సుప్రీంకోర్టు రిషికొండపై నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది.. కోర్టు కంటే పవన్ కల్యాణ్ గోప్పోడా.. ప్రభుత్వ భూమిలో ఉన్న కట్టడాలు అభివృద్ధి చేస్తుంటే పవ కళ్యాణ్ కు ఎందుకు అంతా బాధ అని మంత్రి రోజా ప్రశ్నించారు.

Read Also: Etela Rajender : డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్‌కి లేదు

బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీకి సంబంధించి కబ్జా చేసినా నలబై ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.. దీనిపై పవన్ కు దమ్ముంటే మాట్లాడాలి అని మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ తన కళ్ళును కల్యాణ్ జ్యూలరీలో తాకట్టుపెట్టాడు ఏమో.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇల్లు బంజారాహిల్స్ కోండపైనే ఉన్నాయి.. కోండలపై ఎన్నో కట్టడాలు చాలా చోట్ల ఉన్నాయి.. తిరుమల, సింహాచలంలోనూ రోడ్డు బిల్డింగ్‌ లు అభివృద్ధి చేశారు అని మంత్రి రోజా తెలిపారు.

Read Also: World Cup 2023: ఏందీ మావా.. టీమిండియాను భ్రష్టు పట్టిస్తున్నారు.. మీకంటే పాకిస్థానోళ్లు నయం కదా..

ఇవన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కనపడటం లేదా అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఏమైనా హెరిటెజ్ ఐస్ క్రీం నోట్లో పెట్టుకొని ఉన్నాడా.. నువ్వు ఎవడ్రా పవన్ కల్యాణ్.. జగన్ ఎన్ని ఇళ్ళు కట్టుకోవాలో చెప్పటానికి అని ఆమె విమర్శలు గుప్పించింది. నువ్వే గెలవలేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే లేడు.. నువ్వు ప్రతి పక్షనేత అని ఎలా చెప్పుకుంటావ్ అని మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version