Minister RK Roja: విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఎస్‌ఐ) విజయవంతం కావడంతో.. సంబరాలు నిర్వహిస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇప్పటికే సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది.. ఇక, పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడంతో కేక్ కట్ చేశారు మంత్రి రోజా.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజా టూరిస్టా..? టూరిజం మంత్రా..? అని విమర్శించేవారికి ఇదే నా సమాధానంగా చెప్పుకొచ్చారు.. పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది. టూరిజంలోకి చాలా పెట్టుబడులు వచ్చాయి అని ఆనందం వ్యక్తం చేశారు.. సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ ఏంటో అందరికీ అర్థమైంది.. గతంలో పెట్టుబడుల సదస్సుల్లో జరిగిన ఎంవోయూలు కాగితాలకే పరిమితం అయ్యేవి… కానీ, పెట్టుబడుల సదస్సుకు వచ్చిన బడా పారిశ్రామిక వేత్తలు చూస్తేనే ఎంత సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఇక, పెట్టుబడుల సదస్సు జరిగిన తీరు చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యిందన్నరు మంత్రి రోజా.. పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. కోవిడ్ లేకుంటే ఈ అభివృద్ధి ఎప్పుడో జరిగేదన్న ఆమె.. కరెక్ట్ టైంలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించాం.. టూరిజం శాఖ కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం రెండు కమిటీలు వేశామని వెల్లడించారు. రోజా టూరిస్టా..? టూరిజం శాఖ మంత్రా అని విమర్శలు చేసే వారికి ఇదే సమాధానంగా స్పష్టం చేశారు.. కాకినాడలో డెస్టినేషన్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి.. దేవభూమి సంస్థ ఆధ్వర్యంలో ఏపీలో రోప్ ప్రాజెక్టులు.. విశాఖలో సఫారీ ప్రాజెక్టు రాబోతోందన్నారు. పిల్ల పిత్రే పెట్టుబడుల సదస్సును ఫేక్ సదస్సు అన్నాడు.. కానీ, చంద్రబాబు ఈ స్థాయిలో ఏనాడైనా పారిశ్రామిక వేత్తలను ఒకే స్టేజ్ మీదకు తెచ్చారా..? అని నిలదీశారు. పెట్టుబడుల సదస్సుకు విమర్శలు చేసే వారు వచ్చుంటే సెల్ఫీ తీయించి పంపేవాళ్లం అంటూ సెటైర్లు వేశారు. పెట్టుబడుల సదస్సుతో జగన్ ఇమేజ్ పెరిగిందన్నారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: B Pharmacy Student Collapse: మరో గుండె ఆగింది.. కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన బీఫార్మసీ విద్యార్థి
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ మాట్లాడుతూ.. ఏపీ రిలిజియస్ టూరిజంలో మొదటి స్థానంలో ఉన్నామని వెల్లడించారు.. జనరల్ టూరిజంలో మూడో స్థానంలో ఉన్నాం.. టూరిజం రంగంలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.. ఏ రాష్ట్రంలోనూ టూరిజం రంగానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదన్నారు రజత్ భార్గవ.
