NTV Telugu Site icon

వాళ్లు తప్పులు చేసి మాపై విమర్శలా : పేర్నినాని

Perni Nani

టీడీపీపై మరోసారి మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. 2016-17లో ఓఆర్ఆర్ కట్టాలంటే 8వేల ఎకరాలు అవసరం అని నివేదిక ఇచ్చారని, దీనికి 17 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసి అప్పట్లో చంద్రబాబు కేంద్ర సహాయం అడిగారని ఆయన అన్నారు. భూ సేకరణ చేసి ఇస్తే చూస్తామని కేంద్రం చెప్పిందని, కేంద్రం అడిగినా 2018 వరకు కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు.

అప్పడు వారు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు మా మీద ఆరోపణలు చేయటం ఏంటో విపక్షాలకే తెలియాలని ఆయన విమర్శించారు. చిన ఔట్ పల్లి నుంచి కాజా టోల్ గేట్ వరకు, దుర్గా గుడి ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఐదేళ్ళ కాలంలోనూ చంద్రబాబు కట్టించలేక పోయారని మంత్రి అన్నారు. జగన్ రెండున్నరేళ్లలోనే బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ కు అనుమతి సంపాదించి నిర్మాణం కూడా పూర్తి చేశారని పేర్నినాని వెల్లడించారు.