Site icon NTV Telugu

తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగల వ్యక్తి ఎన్టీఆర్‌: పేర్ని నాని

తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగల వ్యక్తి ఎన్టీఆర్‌ అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌ను ఓ ప్రాంతానికో.. కులానికో పరిమితం చేయొద్దని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రధానులనే నియమించి చక్రం తిప్పానన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు? ఎన్టీఆర్‌ పేరుతో జిల్లా పెట్టాలన్న ఆలోచనను చంద్రబాబు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Read Also: పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్‌ నేరవేరుస్తున్నారు: ప్రసన్నకుమార్‌ రెడ్డి

రెండేళ్ల పాటు కసరత్తు చేసిన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పీఆర్సీ నుంచి డైవర్ట్ చేయడం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెర మీదకు తెచ్చామనడం సరికాదని మంత్రి అన్నారు. ఉద్యోగులతో చర్చల కోసం మూడు రోజులు కాదు.. 30 రోజులైనా వేచి చూస్తామని మంత్రి తెలిపారు. ఉద్యోగులతో చర్చల విషయమై ప్రభుత్వమే ముందడుగు వేసిందన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ గురించి అధికారికంగా చెప్పలేదంటే జీవో ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version