ఇసుక సరఫరా మరోసారి ఏపీలో రచ్చగా మారింది.. ఇసుక విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ఇసుకను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాం.. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తుంది.. ఇక, ఇసుక వివాదంపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం చచేస్తున్నారని మండిపడ్డ ఆయన.. నూతన ఇసుక విధానం పారదర్శకంగా ఉందన్నారు. చంద్రబాబు హయంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందన్న విమర్శించిన ఆయన.. చంద్రబాబు ఇంటి పక్కన ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయన్నారు.
Read Also: Janasena: సీఎం జగన్‌కు జనసేన కౌంటర్.. ఆయన ఉత్తుత్తి పుత్రుడు..!
ఇక, రూ.750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది… కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన టెండర్ల ద్వారా జేపీ సంస్థ టెండర్లు దక్కించుకుందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. జేపీ సంస్థ టర్న్ కి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ మాత్రమే ఇచ్చింది.. వాళ్లు సబ్ కాంట్రాక్ట్ ఎవరికైన ఇచ్చుకోవచ్చు… దానికి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.. అవకతవకలు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకునేది జేపీ సంస్థపైనేనని స్పష్టం చేశారు. కానీ, వైసీపీకి చెడ్డపేరు తీసుకుని రావాలని టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి.. అక్రమ ఇసుక, లిక్కర్ రవాణాపై ఎస్ఈబీ ఉక్కపాదంతో అణచివేస్తోందని స్పష్టం చేశారు.