NTV Telugu Site icon

Peddireddy RamachandraReddy: చంద్రబాబు బంట్రోతు పవన్ కళ్యాణ్

Peddireddy

Peddireddy

జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై మండిపడ్డారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు పర్యటించారు. పట్టణంలోని 12వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బైపాస్ రోడ్డు నందు ప్రతిష్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Read Also: Bhatti Vikramarka : ప్రస్తుత రాజకీయం అంతా నవ్వులాట లెక్క మారింది

భారత స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, ఆయన కాంస్య విగ్రహాన్ని రాష్ట్రంలోనే రెండవ కాంస్య విగ్రహంగా ప్రదర్శించడం చాలా సంతోషదాయకమని ఆయన అన్నారు. అనంతరం జనసేన పార్టీకి ఓటు వేసేవారు ఆలోచించాలన్నారు. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకోవాలన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి బంట్రోతుగా ఉండి చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రి చేయాలని పవన్ పనిచేస్తూ ఉంటే జనసేన ఓటర్లు ఎలా జీర్ణించుకుంటారన్నారు. జనసేనకు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి. ఓటర్లు, జనసేన అభిమానులు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు.

Read Also: Shraddha Walkar Case: 5 కత్తులతో శ్రద్ధా బాడీ ముక్కలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు