Minister Partha Sarathy: పరకామణి కేసు వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలి అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఇక, సాక్ష్యం చెప్పడానికి వస్తున్న మాజీ ఎవీఎస్ఓ సతీష్‌కుమార్ హత్యకు గురయ్యాడు.. గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో అసత్యాలు ప్రచారం చేసినట్లే.. సతీష్ హత్య కేసులోనూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సతీష్‌కుమార్‌ది ఆత్మహత్య అని వైసీపీ నేతలు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. ఆయన హత్య కేసులో వైసీపీ నేతలకు ఎందుకంత ఉత్సాహం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకన్న భక్తులు తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయ కుట్రలను చూసి తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.. 29-04-2023న సుమారు 100 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పరకామణి నుంచి దొంగతనం జరిగింది అని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.
Read Also: Anantnag Arrest NIA: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక అప్డేట్.. కారు బాంబు సప్లయర్ అరెస్టు!
అయితే, టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుపతి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 379, 381 కింద కేసు నమోదైంది. వందల కోట్ల స్వామివారి సొమ్ము చోరీకి గురైతే గత ప్రభుత్వం కేవలం చిన్న చిన్న సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కీలక నిందితుడు రవికుమార్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేయకుండా, రాచ మర్యాదలతో 41A CRPC నోటీసు ఇచ్చి, కాఫీ-టిఫిన్ పెట్టి సాగనంపారు.. కేసు నమోదైన ఒక నెలలోనే ఎలాంటి దర్యాప్తు లేకుండా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని ఆరోపించారు. అయితే, 01-06-2023న ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ కలిసి కోర్టులో “రాజీ” అని జాయింట్ మెమో ఇచ్చారు.. ఈ కేసు రాజీ పడటానికి ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్‌కు ఏమాత్రం అర్హత లేదని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
Read Also: IND vs PAK Shakes Hands: షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాకిస్తాన్ క్రికెటర్లు
ఇక, వైసీపీ పెద్దల సొత్తా.. లేక కోట్లాది మంది భక్తులు ఆరాధించే స్వామివారి సొత్తా రాజీ చేసుకోవడానికి అని పార్థసారథి అడిగారు. ఒక్క రోజు కూడా జైలుకు పోకుండా ముద్దాయి రవికుమార్‌ను సగర్వంగా బయటికి తీసుకొచ్చారు వైసీపీ పెద్దలు.. రూ. 100 కోట్ల విదేశీ కరెన్సీ దోపిడీ నిందితుడితో రాజీ చేసి, స్వామివారి పేరిట కేవలం రూ.14 కోట్ల ఆస్తులు రాయించుకోవడం పెద్ద స్కామ్ అన్నారు. టీటీడీ బోర్డు అజెండాలో “భక్తుడు రవికుమార్ దానం చేశాడని రాసి రికార్డు చేశారు.. దొంగతనం చేసిన వ్యక్తి “భక్తుడా”? అని ప్రశ్నించారు. అలాగే, టీటీడీ విజిలెన్స్ స్వయంగా తమ రిపోర్టులో “పోలీసుల ఒత్తిడి వల్లే లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నామని రాసుకున్నారు.. ఆ ఒత్తిడి తెచ్చిందెవరు? అని అనుమానం వ్యక్తం చేశారు.
