NTV Telugu Site icon

Nitin Gadkari: ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో 4 కోట్ల ఉద్యోగాలు.. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచాలి..

Nitin Gadkari

Nitin Gadkari

ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో 4 కోట్లకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ… ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. స్నాతకోత్సవంలో నలుగురికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.. భారత బయోటెక్ చైర్మన్ ఎండీ కృష్ణ ఎల్లా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, ఆస్ట్రా మైక్రోవేవ్ డైరెక్టర్ ఎంవీ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.. ఇక, స్నాతకోత్సవంలో 1,842 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు..

Read Also: Chiranjeevi: చిరంజీవిగా నేను పుట్టినరోజు.. 44 ఏళ్ల జర్నీపై చిరు ఎమోషనల్

నాలుగు కోట్ల ఉద్యోగాలు ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో ఉన్నాయని.. దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా పెరగడంలో ఈ రంగాలు కీలకం కానున్నాయని తెలిపారు నితిన్‌ గడ్కరీ… ఆర్ధికాభివృద్ధిలో మన దేశం 5వ స్టానంలో ఉంది.. మొదటి స్థానానికి రావడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.. దీని కోసం దిగుమతులు తగ్గించుకోవాలి.. ఎగుమతులు పెంచుకోవాలని సూచించారు. ఇక, తక్కువ ఖర్చుతో ఇందనాన్ని, విద్యుత్ ను అందుబాటులోకి తేవాలన్నారు. మన దేశంలో యువ ఇంజనీర్లకు కొదవలేదు… విదేశాల నుంచి విద్యుత్, ఇంధనం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి రావాలి.. అది మీలాంటి విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఉద్యోగాలు చేయటం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని ఆకాక్షించారు.. విద్యపై పెట్టే పెట్టుబడి భవిష్యత్ నిస్తుందన్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.