Site icon NTV Telugu

Nimmala Ramanaidu: వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరు మిగలరు..

Nimmala

Nimmala

Nimmala Ramanaidu: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అధికారంలోకి వచ్చిన ఎన్ని రోజులకి అమ్మఒడి ఇచ్చావు అంటూ ప్రశ్నించారు. నీకు ధైర్యం లేకపోతే నేను చెప్తాను.. 2019 జూలైలో అధికారంలోకి వస్తే 2020లో అమ్మఒడి అమలు చేశావు అని పేర్కొన్నారు. నీకు అమ్మ ఒడి అమలు చేయడానికి 9 నెలలు సమయం పట్టింది.. కాబట్టి నన్ను ప్రశ్నించే హక్కు ఉందా నీకు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Read Also: Manchu Vishnu: ప్రకాష్ రాజ్‭కు కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..

కాగా, వందకి 100 శాతం తల్లికి వందనం ఇచ్చి తీరుతాం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంట్లో ఒకరుంటే 15 వేలు ఇస్తాం.. ఇద్దరు ఉంటే 30 వేలు ఇస్తాం.. ముగ్గురు ఉంటే 45 వేల రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవడు మిగలడు అని ఆయన చెప్పుకొచ్చారు. నీ కక్కుర్తి, నీ కమిషన్ల కోసం 320 రూపాయలకి నెయ్యిని కొనుగోలు చేసి పవిత్రమైన తిరుమల ప్రసాదంను అపవిత్రం చేశారని అన్నారు. ఈ అంశంలో నిజాలు బయటకు వస్తే.. నిందితులకు కఠిన శిక్ష అనుభవించక తప్పదని మంత్రి నిమ్మల అన్నారు.

Exit mobile version