Nimmala Ramanaidu: మానవత్వం అనురాగం మరిచిపోయిన వ్యక్తిని సీఎంగా చేసామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరానికి ఉరి అని 45.72 నుంచి 41.15కు తగ్గిస్తున్నట్టు ఇవాళే చూసినట్టు రాసారు.. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో నేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసాం.. 45.72 మీటర్లకు నీరు నిలపగలిగితేనే నదుల అనుసంధానం కుదురుతుంది.. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని కేంద్రానికి లేఖలు రాసినపుడు వ్యతిరేకించామన్నారు. 41.15కు తగ్గిస్తే ప్రాజెక్టు కాస్తా బ్యారేజీగా మారిపోతుందని మేం అన్నాము.. 2014 – 2019 మధ్యలో మేం ఎప్పుడూ ఎత్తు తగ్గించాలని అడగలేదు.. 55,548 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందింది పోలవరం ప్రాజెక్టు.. ప్రభుత్వం మారడంతోటే పోలవరానికి గ్రహణం, గండం పట్టాయి.. స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఆదిత్యదాస్ రాసిన లెటర్ లో చాలా క్లియర్ గా ఫేజ్ 1, ఫేజ్ 2ల గురించి చెప్పారని మత్రి నిమ్మల వెల్లడించారు.
Read Also: West Bengal: దుర్గాపూజా మండపాలపై దాడులు.. డీజీపీ నుంచి నివేదిక కోరిన హైకోర్టు..
ఇక, 4.05.2023న శశిభూషణ్ కుమార్ రాసిన లేటర్లో కూడా 41.15 మీటర్లకు తగ్గించి త్వరగా పూర్తి చేయడానికి అనుమతులు కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నేవిగేషన్ సిస్టంలకు సంబంధించిన ప్రిన్సిపుల్స్ తీసేసి అనుమతులు ఇవ్వాలని కోరారు.. 41.15 కి ఇవ్వాలని 2020 నుంచీ కరెస్పాండెన్స్ చేసారు.. మేం ఎప్పుడూ 45.72 మీటర్లకే పూర్తి చేస్తామనే మాటకు కట్టుబడి ఉన్నాం.. 12,257 కోట్లు గత ప్రభుత్వం లో రాకపోవడం ప్రజల, రైతుల అదృష్టం.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం 45.72 మీటర్లు నీళ్ళు నింపడానికి రాజీ లేకుండా పని చేస్తుందన్నారు. ఫస్ట్ ఫేస్ లో 41.15, సెకండ్ ఫేస్ లో 45.72 గా మేం చేస్తాం.. ప్రపంచం మొత్తం పోలవరం వైపు చూస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.