Site icon NTV Telugu

Minister Nimmala: గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని ఇరిగేషన్ అస్తవ్యస్తమైంది

Nimmala

Nimmala

Minister Nimmala: నేటి నుంచి రాజమండ్రి జిల్లాలో 45 ఇసుక ర్యాంపులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలు ఇసుక కొరత రాకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక స్టాక్ పాయింట్లు ఈరోజు నుంచి ఏర్పాటు చేస్తున్నాం.. ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో భారీ ఎత్తున చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇక, ప్రతి రైతు ప్రభుత్వ నిర్ధారించిన రైస్ మిల్లులకే అమ్మాలని మంత్రి నిమ్మల తెలిపారు.

Read Also: Extramarital Affairs: పెరిగిపోతున్న ఇల్లీగల్ ఎఫైర్స్.. భర్తలనే చంపేస్తారా..?

అయితే, ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని మంత్రి రామానాయుడు చెప్పుకొచ్చారు. రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజ కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లులు వెనకబడి ఉంటున్నారని అపవాదుపై చర్యలు తీసుకుంటాం.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని ఇరిగేషన్ అస్తవ్యస్తమైంది.. మే నెలలో 10 కోట్ల 39 లక్షల రూపాయల వ్యయంతో గోదావరి ఆధునీకరణ పనులు చేపడుతామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

Exit mobile version