NTV Telugu Site icon

Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరానికి శాపంగా మారింది..

Ramanaidu

Ramanaidu

Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.. తెలుగుదేశం పార్టీ (టిడిపి) పాలనాలో సుమారు 300 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా ఇచ్చి 30 లక్షల ఎకరాల్లో సాగుకు ఇబ్బందు లేకుండా చూసాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ ఎత్తిపోతల రైతులకు సాగునీరు అందే పరిస్థితులు ఏర్పడ్డాయి.. జగన్ రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు.. పులిచింతల లాంటి ప్రాజెక్టులో సైతం ఒక టీఎంసీ నీటిని కూడా నిలుపలేకపోయారు.. అద్వానంగా జగన్ పాలన కొనసాగింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ప్రకారం ఒక నీటి చుక్క కూడా వృధా కాకుండా పట్టిసీమ ద్వారా నీటిని రేపటి నుంచి తరలిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

Read Also: Assam Flood: అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు.. 45కి చేరిన మృతులు

ఇక, ఇవాళ పోలవరం ప్రాజెక్టును అధికారులతో కలిసి ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ యొక్క పనులు ఎంత వరకు వచ్చాయి.. చేపట్టబోయే పనుల గురించి ఈఎన్సీ అధికారుల దగ్గర నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. అలాగే, గత ప్రభుత్వ పాలనలో ఎలాంటి విచ్ఛినం జరిగింది.. పోలవరం ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉందనే విషయాలను విదేశాల నుంచి వచ్చిన జలవనరుల నిపుణులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పని చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.