Nara Lokesh: వైసీపీకి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. 24 గంటల డెడ్ లైన్
- వైసీపీ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్..
- తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్..
- తల్లికి వందనం పథకంపై వైసీపీ విషం చిమ్ముతుంది: మంత్రి లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైసీపీ ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై జగన్ అండ్ కో కుట్రలు, కుతంత్రాలు – తల్లికి వందనం పథకంపైనా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటల విని జనం నవ్విపోతారన్న స్పృహ కూడా లేకుండా అభాండాలు మోపుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక, తల్లికి వందనంలో మినహాయించే రూ. 2 వేలు లోకేష్ లాగేసుకున్నారట.. దిక్కుమాలిన ఆరోపణలతో వైసీపీ బరితెగింపు ట్వీట్ చేసిందని ఐటీ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
Read Also: Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
Also Read
- OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
- OTR : వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయాలకు సిద్ధం అయిందా? ఆ ముగ్గురు నేతల పరిస్థితి ఏంటి?
- Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
- OTR : సొంత వైఎస్సార్సీపీకి షాకిస్తున్న ఎమ్మెల్సీ.. పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వెనుక ఆంతర్యమేంటి?
అయితే, వైసీపీ చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఇలా పచ్చిగా రెచ్చిపోవడం అలవాటుగా మార్చుకుందని అన్నారు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు పంపిణీ చేస్తే కడుపు మండుతుందన్నారు. రేషన్ వాహనాలు రద్దు చేసి ప్రజాధనాన్ని కాపాడితే ఆందోళన చేస్తున్నారు. రాజధాని అమరావతికి పునర్ వైభవం తెచ్చే పనులు చేస్తే అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేసే తంతు చేస్తున్నారు. గతంలోనూ వివేకా హత్య కేసును చంద్రబాబుపై తోసేసే ప్రయత్నం చేశారు.. నారా సుర రక్తచరిత్ర అంటూ నానా యాగీ చేశారు.. పింక్ డైమండ్ చంద్రబాబు దగ్గరే ఉందంటూ రచ్చ రచ్చ చేశారు.. కోడికత్తి నుంచి.. గులకరాయి ఘటన వరకు టీడీపీపై నెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ.. కానీ, ఈసారి వైసీపీ ఆరోపణలపై కఠినంగా వ్యవహారిస్తామని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!