NTV Telugu Site icon

Nadendla Manohar: ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు..

Nadendla

Nadendla

Nadendla Manohar: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అని తేల్చి చెప్పారు. అయితే, 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంత మందికి ఇస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచితి ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పుకొచ్చారు.. ఎన్డీఏ కూటమిలో భాగంగా మా మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకొని వివిధ శాఖలతో చర్చించి సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తాం అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ వెల్లడించారు.

Read Also: OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న కింగ్ ఆఫ్ ది ప్లానెట్ ది ఎప్స్..ఎక్కడో తెలుసా ..?

ఇక, రాష్ట్రంలో త్వరలోనే 674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు రైతులకు అందిచాలని నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహయకేంద్రాలుగా మార్చుతున్నాం.. తూర్పు గోదావరి, కాకినాడలో రైతులకు హమీ ఇచ్చాము.. టార్పాలిన్ లను కార్పోరేషన్ నుంచి ఉచితంగా అందిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క రైతుకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు.