New Ration Cards: రేషన్ కార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు అవకాశం ఉంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వేరే ప్రాంతానికి వలస వెళితే రేషన్ కార్డులను సరెండర్ చేయొచ్చని సూచించారు. ఇక, కొత్త రేషన్ కార్డులని స్మార్ట్ కార్డు తరహాలో ఇస్తున్నాం అని తేల్చి చెప్పారు. కొత్త డిజైన్ చేసి రేషన్ కార్డు ఇస్తున్నాం.. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ ప్రధానం కానుంది.. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు అన్ని అందుబాటులో ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Read Also: Yamadonga : యమదొంగ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
అయితే, గ్రామ వార్డ్ సచివాలయంలో కొత్త రేషన్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలి అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల చెప్పారు. జూన్ లో అందరికి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట వివరాలు రేపు మాధాహ్నం వరకు వస్తాయని పేర్కొన్నారు. ఇక, రేపు సీఎం చంద్రబాబు దగ్గర పంట నష్టంపై సమీక్ష సమావేశం జరగనుంది.. తడిసిన ధాన్యం ఖచ్చితంగా కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చాం.. దీపం 2 పథకంలో కోటి 50 లక్షల 19 వేల 303 గ్యాస్ సిలండర్లు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందించిందన్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో సన్న బియ్యంతో భోజనం పెట్టెలా ఏర్పాట్లు చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
