టీడీపీ మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా టీడీపీ శ్రేణులు. అయితే.. ఈ మహానాడు వేడుకల్లో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ రధం చక్రాలు ఊడిపోయాయి అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని ఆయన అన్నారు.
అందుకే హైదరాబాద్ వెళ్లి పోయాడని, లంకెలపాలెంలో మా యాత్రకు వచ్చినంత మంది కూడా మహానాడు కు రావటం లేదన ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర అధ్యక్షుడు అంటారు…కానీ ఫ్లెక్సీల్లో అచ్చెన్నాయుడు ఫోటోలు కూడా లేవని ఆయన చురుకలు అంటించారు. ఆ సంగతేంటో చూసుకుంటే మంచిది.. అమలాపురం ఘటనకు కారకుడు చంద్రబాబే అని ఆయన ఆరోపించారు.