Site icon NTV Telugu

Meruga Nagarjuna: చంద్రబాబుకు మతి భ్రమించింది.. వాళ్ల పాదయాత్రలో రైతులు ఎక్కడున్నారు?

Meruga Nagarjuna

Meruga Nagarjuna

Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని.. ఆయనకు జబ్బుతో పాటు వయసు కూడా సహకరించడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్‌ తమపై అసభ్యపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. లోకేష్‌కు 40 ఏళ్లు కూడా ఉండవని.. ఆయనకు తాము కొడుకులం ఎలా అవుతామని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. లోకేష్ ఒక లుచ్చా అని.. ఆవు చేలో మేస్తే.. దూడ కూడా చేలోనే మేస్తుందని.. చంద్రబాబు గడ్డి తింటున్నారు కాబట్టి ఆయన కొడుకు కూడా గట్టి తింటున్నాడని ఫైర్ అయ్యారు. తమకు సంస్కారం ఉంది కాబట్టి చంద్రబాబును ఆ మాట అనటం లేదన్నారు. తాము అంతకన్నా భాష తెలిసిన వాళ్లమేనని.. నాలుగు రెట్లు చంద్రబాబు కన్నా బూతులు తిట్టగలమన్నారు.

Read Also: Ram Charan: కొత్త లుక్‌లో అదరగొడుతున్న చెర్రీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకోలేక పోతే రాబోయే ఎన్నికల్లో సరిగ్గా పర్యటనలు చేయలేరని మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. టీడీపీ నేతలు తమను రాజీనామాలు చేయమని మాట్లాడుతున్నారు అని.. రాజీనామాలు చేయాల్సిన పని తమకు లేదన్నారు. ప్రజలకు తమకు మాండేటరీ మెజారిటీ ఇచ్చి ఎన్నికల్లో గెలిపించారన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా ఐదేళ్లు పరిపాలన చేస్తామని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తామని.. అప్పుడు చంద్రబాబు దమ్ముంటే తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాజధాని ప్రాంతంలో చేసే పాదయాత్రలో రైతులు ఎక్కడ ఉన్నారని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు బతకకుండా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో పాదయాత్ర చేసేవాళ్లు ఎక్కడికి నడుస్తున్నారు, ఏం సాధిస్తారో చెప్పాలన్నారు. రాజధాని అనేది ఎవరికి ఉపయోగమో త్వరలో తెలుస్తుందన్నారు.

మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా కూడా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కాకినాడలో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలను దుష్ట చతుష్టయం మోసం చేస్తుందన్నారు. తొండంగి మండలం ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్‌ను స్ధానిక మత్స్యకారులు, హేచరీ యాజమానులు స్వాగతిస్తున్నారని.. కానీ ఈ ప్రాజెక్ట్ అడ్డుకునేందుకు చంద్రబాబు యనమలతో లేఖ రాయించి కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో వర్షాలు వచ్చినా.. పరిశ్రమలు వచ్చినా దుష్ట చతుష్టయానికి ఏడుపులే అని చురకలు అంటించారు. కరోనా వచ్చినా ఏపీ డబుల్ డిజిట్ గ్రోత్‌లో ఉందని స్పష్టం చేశారు. పచ్చ మీడియా ఈ విషయాన్ని రాయదన్నారు. ఏ హక్కు ఉందని చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌ను తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం చేస్తున్న అన్యాయాలను, బ్లాక్ మెయిలింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేష్‌లకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

Exit mobile version