Minister Kottu Satyanarayana: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. తాజా పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీడీపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఇక, ఉనికి కోసమే టీడీపీ ఆరాటం.. తమ పార్టీ బతికే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు.. పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదూ బొక్కా లేదూ అనటం అంటే ఆ పార్టీ లేనట్లే కదా..? అని సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యం పై టీడీపీకి విశ్వాసం లేదని మండిపడ్డ ఆయన.. ప్రజలే తప్పు చేశారని అనటం ప్రజా తీర్పును అవమానించడమే అన్నారు.. రాష్ట్రంలో దాడులు జరగటానికి అవకాశం ఎక్కడ ఉంది? అని విపక్షాన్ని నిలదీశారు మంత్రి కొట్టు.. రంగా హత్య ఎవరి ప్రోద్బలంతో జరిగిందో అందరికీ తెలుసన్న ఆయన.. ప్లాన్ ప్రకారం నాటి టీడీపీ ప్రభుత్వం వంగవీటి రంగాను హత్య చేసిందని ఆరోపించారు. ఇప్పుడు టీడీపీ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కాగా, నిన్న వైజాగ్ వేదికగా జరిగిన కాపునాడు బహిరంగసభకు.. అధికార వైసీపీతో పాటు, ప్రతిపక్ష టీడీపీ నేతలకు కూడా దూరంగా ఉన్న విషయం విదితమే.. జనసేన నేతలు, బీజేపీ నాయకులు ఈ సభకు హాజరయ్యారు.. ఈ వేదికపై నుంచి వంగవీటి రంగా హత్యపై నేతలు వ్యాఖ్యానించిన విషయం విదితమే.
Read Also: Kanaka Durga temple: కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ..
