Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. అసలైన మూడు ముక్కలాట పవన్ కల్యాణ్‌కే వర్తిస్తుందన్నారు.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే చంద్రబాబు స్క్రిప్ట్ చదివినట్టు ఉందన్న ఆయన.. ప్రజా రాజ్యం మూసేసిన రోజున, జనసేన పెట్టిన సమయంలో మాట్లాడిన మాటలు పవన్ కి గుర్తులేవా? అని ప్రశ్నించారు.. 2019 అప్పటినుంచి లెక్కలు చెబుతున్నారు .. రాష్ట్రం విడిపోయినప్పటి గురించి మాట్లాడటం లేదు ఎందుకు అని నిలదీశారు. సభకు వచ్చిన యువతకు రౌడీలు, గూండాలు గా మారమని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. విద్య, వైద్యం, ఉపాధి విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందుందన్న ఆయన.. గతంలో మద్దతు పలికిన పార్టీని ఎందుకు ప్రశ్నించ లేకపోతున్నారు అని ఫైర్ అయ్యారు.. అమరావతి కోసం ఉత్తరాంధ్ర వాళ్ళని ఒప్పించడానికి పవన్ వచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు.. సమాజం పట్ల బాధ్యత వుంటే సినిమా డైలాగులు పక్కన పెట్టాలని హితవుపలికారు.. సింగిల్ గా వెళ్లే దమ్ము లేదు.. బీజేపీ ఒక రకంగా వుంటూ, టీడీపీతో బేరసారాలాడుతున్నారని.. మూడు ముక్కలాట పవన్ కే వర్తిస్తుందని మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: Yuvashakti Resolutions: ‘యువ శక్తి’ తీర్మానాలు ఇవే..