NTV Telugu Site icon

Minister Karumuri: కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్‌ ఇస్తున్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఏపీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వచ్చి అభినందిస్తున్నారు.. కానీ, కేటీఆర్ ఎవరి మహర్బానీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని కౌంటర్‌ ఇచ్చారు.. కేటీఆర్ ఆ రకంగా మాట్లాడకూడదన్న ఆయన.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్నారు…ఇచ్చారా? నాలుగు చినుకులు పడగానే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది.. డ్రగ్స్ కేసులు ఏ రకంగా హైదరాబాద్‌లో ఉన్నాయో అందరికీ తెలుసు.. ఇలాంటివి చెబితే చాలా ఉంటాయన్నారు.

Read Also: RK Roja: కేటీఆర్‌ వ్యాఖ్యలపై రోజా రియాక్షన్‌..

ఇక, సీఎం జగన్‌కు మంచి పేరు ఉంది.. అందుకే ఆయన పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు నాగేశ్వరరావు.. ఒక వేలు ఇటు చూపించే ముందు నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తున్నాయని కేటీఆర్ గుర్తిస్తే మంచిదని సూచించారు. జగన్ కు మేం అభిమానులం అని చాలా మంది బహిరంగంగానే చెబుతారు.. కానీ, టీడీపీ నేతలే కేటీఆర్‌ను ప్రభావితం చేసి ఉంటారని విమర్శించారు. జగన్ పై వ్యాఖ్యలు చేస్తే నేను కూడా పెద్దవాడిని అవుతానని కేటీఆర్‌ అనుకుంటున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు మంత్రి నాగేశ్వరరావు.