NTV Telugu Site icon

Karumuri Nageswara Rao: లక్ష కోట్లు అమరావతికి పెడితే.. మరి సీమ, ఉత్తరాంద్ర పరిస్థితి..?

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ నేత నోట విన్నా.. అమరావతి.. మూడు రాజధానుల మాటే.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం.. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యం అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, అమరావతినే అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు.. కానీ, అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు మాత్రం.. ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు.. అమరావతి రైతుల పేరుతో పాదయాత్రలు చేస్తున్నవారు కోటీశ్వరులని ఆరోపిస్తు్నారు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లక్ష కోట్లు అమరావతికి పెడితే.. మరి రాయలసీమ, ఉత్తరాంద్ర పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు..

Read Also: Thammineni Seetharam: అమరావతే రాజధాని అన్నవాడిని పొలిమేరల‌ నుంచి తరిమి తరిమి కొట్టాలి..!

ఆంధ్రప్రదేశ్‌ని శ్రీలంక చేయాలని చూసిన చంద్రబాబు లక్ష కోట్లతో రాజధాని అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు మంత్రి కారుమూరి.. ఇక, చంద్రబాబు విజయవాడవారికి తీవ్ర అన్యాయం చేశారన్న ఆయన… తాత్కాలిక భవనాల పేరుతో వేలకోట్లు వృథా చేశారని మండిపడ్డారు.. కేవలం ఒక్కప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే మిగతావారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.. మరోవైపు.. 14 ఏళ్ల పాటు ప్రజల సొమ్ము చంద్రబాబు దోచుకుతిన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ది చెందాలనే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.