Site icon NTV Telugu

Minister Karumuri: టీడీపీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు

Minister Karumuri Nageswara

Minister Karumuri Nageswara

అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని.. మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుంచి వచ్చారని.. ప్రశ్నించారు. టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని, ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ను కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్న పాత్రుడు నడుస్తున్నాడని విమర్శించాడు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటని ప్రశ్నించారు. బీసీలు సెక్రటేరియట్ లోకి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి బీసీలకు ఎలా న్యాయం చేస్తారని అడిగారు.

అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలా.?, మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. గతంలో బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు  చేశారో చూశామని అన్నారు.బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడని.. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిదని తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారని.. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోందని కారుమూరి అన్నారు.

బీసీలను చంద్రబాబు ఓట్లేసే యంత్రాలుగానే చూవారని.. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదని వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రపంచమంతా కూడా కరోనా రాకుండా చంద్రబాబు ఆపేవారేమో ..? అని ఎద్దేవా చేశారు.  తుపానులు ఆపుతానంటాడు, ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గిస్తానంటాడు, ఇలాంటి పిచ్చి మాటలు విని జనం నవ్వుకుంటున్నారని అన్నారు.

చంద్రబాబు విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారని.. మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతని..చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జై జగన్ అంటున్నారని.. జగన్ పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదని.. ఇక ఇంటికొకరు ఏం వస్తారు అని సెటైర్లు వేశారు. కేంద్రంపై పోరాటం చేయలేక జగన్ ని విమర్శిస్తున్నారని విమర్శించారు.

Exit mobile version