Site icon NTV Telugu

Kakani Govardhan Reddy : 2024లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర తిరగరాస్తాం

Kakani Govardhan

Kakani Govardhan

వైసీపీ ప్లినరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ క్రమంలో నెల్లూరులో వైసీపీ ప్లినరీ సమావేశాలకు హాజరైన మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95 శాతాన్ని జగన్ అమలు చేశారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనల్లో వ్యత్యాసం చాలా ఉందని ఆయన అన్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమం అందుతోందని ఆయన వెల్లడించారు.

అమ్మ ఒడిపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని చంద్రబాబు గాలికొదిలేశారని, బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి అన్నివర్గాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ శ్రమిస్తున్నారన్నారు. 2024లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర తిరగరాస్తామని మంత్రి కాకాణి ధీమా వ్యక్తం చేశారు.

 

Exit mobile version