NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: వాళ్లు డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యాధారాలున్నాయి.. పార్టీ ప్రక్షాళన చేస్తాం

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Minister Kakani Govardhan Reddy On Suspended MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారనే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు అధిష్టానం వద్ద ఉన్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఆ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ విధంగా మాట్లాడారని వివరణ ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనే విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలపై దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదన్న ఆయన.. జిల్లాలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామన్నారు.

Bandi sanjay: ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం.. కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు..

ఇదే సమయంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా టీడీపీ గెలిచిందో అందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యేలను రూ.10 కోట్లకు టీడీపీ కొనుగోలు చేసి, ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ విజయంపై పచ్చ మీడియా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూచంద్రబాబును ప్రజలు ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దత్తపుత్రుడుతో కలిసి పోటీ చేసినా.. చంద్రబాబుకు ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని పంపించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని కొనాలని చంద్రబాబు డబ్బులు పంపించిన వైనం దేశమంతా చూసిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు అలవాటేనని పేర్కొన్నారు.

Extramarital Affair: ప్రియురాలి కోసం భార్య హత్య.. సినిమా స్టైల్‌లో స్కెచ్.. చివర్లో ట్విస్ట్

ఇదిలావుండగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ హైకమాండ్, నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! అంతర్గతంగా దర్యాప్తు చేసి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారని తెలిసి.. వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా ఇచ్చి కొనుగోలు చేశారని సజ్జల రామకృష్ణా ఆరోపించారు. అది నిరూపించాలని సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, పై విధంగా తమ వద్ద సాక్ష్యాలున్నాయని మంత్రి కాకాణి బదులిచ్చారు.

Show comments