గతంలో అనేకమంది బలహీనవర్గాల వారు సీఎంలుగా చేశారు.. కానీ సామాజిక న్యాయం చేసింది మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి. బీసీ, ఎస్టీ, ఎస్సీలు మైనారిటీల మీద ప్రేమ ఉంటే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని కోరుతున్నా.. 2014 నుంచి 2019 వరకూ సామాజిక న్యాయం ఏం చేశావు.. 2019 నుంచి 2023 వరకూ జగన్ హయాంలో సామాజిక న్యాయం ఏం జరిగిందో చర్చిద్దాం.. ఆ చర్చలోనే చంద్రబాబు పారిపోయేలా చేస్తాం… బలహీనవర్గాల వారికి డీబీటీ ద్వారా 2 లక్షల కోట్లు వారి చెంతకు చేర్చాం.. చంద్రబాబు హయాంలో ఆయన తాబేదార్లకు న్యాయం జరిగింది. చీఫ్ మినిస్టర్ టు కామన్ మేన్ బటన్ నొక్కుతుంటే.. ప్రతి గడపగడపకు న్యాయం జరుగుతోంది. బీసీ మేధావులు, బీసీలలో ఉన్న ఉపాధ్యాయులు అన్ని వర్గాల వారు జగన్ పక్షాన అడుగులు వేయాలి-మంత్రి జోగి రమేష్