Minister Jogi Ramesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలకు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు కూలదోసి అధికారంలోకి వచ్చినప్పుడు బాలకృష్ణ ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి కోరికను నెరవేర్చలేదని.. పార్టీని లాక్కొని సీఎం పీఠంపై మీ బావ కూర్చోలేదా అని బాలయ్యను మంత్రి జోగి రమేష్ నిలదీశారు. తెలుగు జాతికి ఎన్టీఆర్‌ను దూరం చేసింది ఎవరో చెప్పాలని సూటిగా అడిగారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందెవరో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉండేలా జిల్లా పేరు పెట్టామని స్పష్టం చేశారు. యూనివర్సిటీ అనేది చాలా చిన్నది అని.. జిల్లా అనేది చాలా పెద్దది అని.. యూనివర్సిటీకి పేరు మార్పు అంశాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.
Read Also:Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో శశిథరూర్.. ఆ ఇద్దరి మధ్యే పోటీ!
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను బాలకృష్ణ ట్వీట్ చేశారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. పునర్జన్మ ఇచ్చిన వైఎస్ఆర్‌కు బాలయ్య రుణపడి ఉండాలని కాల్పుల కేసును ఉద్దేశిస్తూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు. తండ్రిని చంపిన వ్యక్తి ఇంటికి బాలకృష్ణ పిలనిచ్చాడు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ కేరాఫ్ అడ్రస్ నారా అని.. మీరే అసలైన శునకాలు అని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే శునకం దగ్గర నందమూరి కుటుంబ సభ్యులు పదవులు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని గుర్తుచేశారు. చరిత్రలో చెరగని విధంగా ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు నామకరణం చేసిన మొనగాడు జగన్ అని మంత్రి జోగి రమేష్ కొనియాడారు.
