Gudivada Amarnath: నటసింహా, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కామెంట్లపై కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన… గిగాబైట్ కు మెగా బైట్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తేడా తెలియదన్న బాలయ్య వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాలకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడడం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు.. వెన్నుపోటిదారుడికి సహకరించిన వాళ్లా సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోకేష్ పాదయాత్ర (నారా లోకేష్ యుగళం పాదయాత్ర)లో అన్ స్టాపబుల్ కంటే ఎక్కువ కామెడీ జరుగుతోందని సెటైర్లు వేశారు.. అయితే, రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ స్టాపబుల్ అంటూ వ్యాఖ్యానించారు. అసలు బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అవగాహన ఎంత..? అని ప్రశ్నించారు.. ఒక్కరోజైన నియోజకవర్గం గురించి మాట్లాడారా..? అని నిలదీశారు.. రాసిచ్చిన డైలాగులు చెప్పేస్తే జనం ఏదో అనుకుంటారని భావిస్తే బాలకృష్ణ కంటే అమాకుడు మరొకరు ఉండరంటూ హితవుపలికారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: Sai Prasad Reddy: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. అసంతృప్తి వాస్తవమే..!
కాగా, అనంతపురం జిల్లాలో మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. రాష్ట్రప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా బైట్లు గిగా బైట్లు అంటే ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. మీకోసం మీనాయకుణ్ని మీరు ఓటు అనే ఆయుధంతో ఎన్నుకొవాలని ప్రజలకు సూచించారు. ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ఎవడి అబ్బసొమ్మని అప్పులు చేశారంటూ సీఎం వైఎస్ జగన్ తీరును తప్పుబట్టారు. ఇక, రాష్ట్రం నాలుగేళ్లలో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందన్న ఆయన.. ఐదు కోట్ల మంది కలలు కన్న రాజధాని ఎమైందో తెలియడంలేదని, రాజధాని అమరావతి కోసం రైతుల ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.