Dharmana Prasada Rao: మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి..! ఓ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతూనే ఉంది.. మూడు రాజధానుల ఏర్పాటు వైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండగా.. విపక్షాలు మాత్రం.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై మండిపడ్డారు.. జన్మభూమి కార్యకర్తలు పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.. జన్మ భూమి కార్యకర్తలు స్వతంత్ర సమరయోధుల్లా వీధుల్లో పడి తిరిగేవాళ్లని విమర్శించారు. కానీ, వైఎస్ జగన్ సర్కార్‌లో సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా.. నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని.. ఈ ప్రభుత్వంలో సంక్షేమం చూడలేక బాదుడే బాదుడు అని చంద్రబాబు తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చే శారు.
Read Also: Lucky Lakshman Movie Review: లక్కీ లక్ష్మణ్ రివ్యూ
Also Read
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- OTR: నిడదవోలు కూటమిలో కొరకరాని కొయ్యలా బూరుగుపల్లి
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
ఇక, ఉత్తరాంధ్రలో తిరుగుతూ అమరావతి రాజధాని అని చంద్రబాబు చెబుతున్నారంటే మన చేతులతో మన కళ్లని పొడిచే ప్రయత్నమే అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన.. చంద్రబాబు అమరావతి రాజధాని అని చెబుతున్నాడు.. అదే జరిగితే, మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి.. మేం ఒక చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాల్లో ఇంకా ఎక్కడో సైకిల్ భావన ఉంది, ఇంకా సైకిల్ ని నమ్మి మోసపోకండి అంటూ పిలుపునిచ్చారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని ఆరోపించారు.. ముసలివాడు అయినా మొన్న కారుమీద ఎక్కి డ్యాన్స్‌లు చేశాడు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అయితే, మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి..
తాజావార్తలు
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!