విశాఖను రాజధానిని చేస్తే టీటీడీ అధినేత చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణలో బిజినెస్‌లు చేస్తూ హైదరాబాద్‌లో ఉంటాడు.. మాకు విశాఖ రాజధాని వద్దంటారు అంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో రైతుల భూ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకురావడంతోనే శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం తీసుకువచ్చామన్నారు.. కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్నారన్న ఆయన.. రీసర్వేకు రైతులు సహకరించి, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని.. రిజిస్ర్టేషన్‌కు సబ్ రిజిష్ర్టార్ కార్యాలయాలు, ముటేషన్‌కు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదని.. రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని గ్రామ సచివాలయంలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు..
Read Also: Vishnu Kumar Raju: ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను అంగీకరించేది లేదు..!
ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి ఒక్క పని కొచ్చిన కార్యక్రమం జిల్లాలో చేపట్టలేదని ఎద్దేవా చేశారు మంత్రి ధర్మాన.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంస్థలు కుడా పెట్టించలేని దిక్కుమాలిన పరిస్థితి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడిదని మండిపడ్డారు.. మేం అధికారంలోకి వచ్చాక, రూ.700 కోట్లతో ఉద్దానం కిడ్నీ ప్రభావిత ప్రాంతానికి నీరు అందించే ఏర్పాటు చేశామన్నారు.. పలాసలో 100 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.. వంశాధార అంశంలో ఒడిస్సా తో మాటాడారు.. 19 టీఎంసీలతో వంశాధార రిజర్వాయర్ నింపే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.. రాష్ర్టానికి దూరంగా జూమ్ కెమెరాకు దగ్గరగా ఉంటాడు అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.. అసలు విశాఖలో రాజధాని ఏర్పాటైతే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? అంటూ నిలదీశారు.. తొకముడిచి పాదయాత్ర ఆపేసారు.. ఇక్కడకు పాదయాత్ర వచ్చి ఉంటే తెలిసేది అని వార్నింగ్ ఇచ్చారు.. పాదయాత్ర కొనసాగితే టీడీపీకి ఉత్తరాంధ్రలో ఒక్కసీటు కూడా వచ్చిఉండేది కాదన్నారు.. టీడీపీ సాయం చేయలేదు.. చేస్తే ఓర్వలేదని.. సాయం చేస్తున్న నేతలను ఆపేస్తే పాపం తగులుతుందన్నారు.. టీడీపీని శ్రీకాకుళం జిల్లా నుంచి వెలివేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.