Dadisetti Raja: ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన వేళ.. ఆస్కార్‌కు లింక్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి దాడిసెట్టి రాజా.. పవన్ కళ్యాణ్ అలియాస్ దత్త పుత్రుడు 3 నెలల విరామం తర్వాత హడావిడి చేస్తున్నారు.. ఏపీలో బీసీ రాజ్యాధికారం అంటే కాపులు, బీసీలు కలిసి చంద్రబాబు పల్లకి మోయటమా పవన్ ? అంటూ నిలదీశారు. చంద్రబాబుతో కొత్తగా కలిసి ఉన్నట్లు రెండు రోజులుగా పవన్ చెప్తున్నాడు.. 2014 నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే ఉన్నాడు.. కాపులు, బీసీలు టీడీపీకి జనసేనకి బానిసలుగా ఉన్నట్టు పవన్ మాటలు ఉన్నాయని.. 2019 ఎన్నికల్లో 18 పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చావు పవన్ అంటూ నిలదీశారు.
Read Also: RRR: విశ్వ వేదికపై ఇండియన్ సినిమాకి గొప్ప గౌరవం- ప్రముఖుల ప్రశంసలు
2019 ఎన్నికల్లో ఓట్లు చీల్చడం కోసం అభ్యర్థులను బరిలో నిలపటం నిజం కాదా పవన్ అంటూ ప్రశ్నించారు మంత్రి రాజా.. హరి రామ జోగయ్య కాపు సంక్షేమ సేన పేరు మార్చి కమ్మ సేవా సమితి అని పెట్టుకోవాలని సెటైర్లు వేసిన ఆయన.. వంగవీటి రంగాను చంపింది చంద్రబాబు అని చెప్పిన హరి రామ జోగయ్య.. మళ్లీ చంద్రబాబు సంక నాకెందుకు సిద్ధమయ్యాడంటూ మండిపడ్డారు. రేపు చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ కల్యాణ్ చదువుతాడు అని విమర్శించారు.. ఆర్‌ఆర్‌కు వచ్చిన ఆస్కార్ కంటే పవన్ కల్యాణ్ యాక్టింగ్ ఎక్కువగా ఉండబోతుంది అని ఎద్దేవా చేశారు.. కాపులు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.. నువ్వు ఏ రోజైనా దానిని ప్రశ్నించావా పవన్? అని నిలదీశారు.. కాపులు, బీసీలు, ఎస్టీలపై కేసులు పెడితే నువ్వు ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేలు? అని నిలదీశారు. చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమంటే కేసులు పెట్టారు. కాపులు ఎవ్వరూ పవన్ ను నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు.. ఇక, 175 స్థానాల్లో టీడీపీకి, జనసేనకు డిపాజిట్లు కూడా రావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దాడిసెట్టి రాజా.