NTV Telugu Site icon

Minister Chelluboina Venu: నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. నేడు వైసీపీ నేతలపై గ్రాఫిక్స్‌ చేయిస్తున్నారు..!

Minister Chelluboina Venu

Minister Chelluboina Venu

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై గ్రాఫిక్స్ చేయిస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఎపిసోడ్‌పై ఆయన స్పందిస్తూ… నాలుగు రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి.. గ్రాఫిక్స్‌ చేసింది ఎవరో బయటపడుతుందన్నారు.. ఇక, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని టీడీపీ ప్రభుత్వం హింసించినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు.. కాపు రిజర్వేషన్ ఇస్తానని నాడు అల్లర్లుకు కారకుడైన చందబాబు… పవన్‌ కల్యాణ్‌తో జత కడుతున్నారని విమర్శించారు.. చంద్రబాబు మరో ముసుగు వేసుకుని మోసగించడానికి వస్తున్నాడు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాల ప్రజలు తస్మత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.

Read Also:Nandamuri Balakrishna: సోషల్ మీడియా వైపు వెళ్లకండి.. విద్యార్థులకు బాలయ్య సూచన